Wednesday, 6 October 2010
అనుకుంటాం కాని నిజమే!
ఈ మధ్య సాక్షి పేపర్ లో ఒక కధ చదివా .అందులో భార్య ఇంట్లో పెళ్లి కి వెళ్లి వస్త్తున్న భర్త అత్తగారింట్లో జరిగిన అమర్యాదకు భార్యని కోపడతుంటాడు. అదేమిటో కాని అల్లుడి హోదా నూటికి 99 మంది కాదు కోటిమందిలో ఒక్కడు కూడా వెలగబెట్ట కుండ ఉండలేరు. ఎంత మర్యాదచేసిన వాళ్ళకి ఏదో ఒక వంక దొరుకుతుంది అత్తగారి వాళ్లన్ను సాధించడానికి . అతడు సినిమాలో బ్రహ్మనందం పాత్ర కొంత అతిశయొక్తిగా అనిపించినా కానీ చాల మంది అలాగే వుంటారు.మా freind ది మేనరికం ఐన సరే వాళ్ళాయన వాళ్ళ అత్తాగారి వంటకు వంకలు పెడతారంట .తను ఎంత చేత్తగా చేసిన మాట్లాడకుండా తిన్తారట.కాలం ఎంత మారిన ఇంకా పాతకాలపు అలవాట్లనుండి ఎందుకు దూరం కారో అర్దం కాదు. ఆడవాళ్ళకి సమానా హక్కులు కోర్టులో కాదు సమాజంలో రావాలి. ఇలా అన్నంత మాత్రనా నేనేదో ఫెమినిస్టు అనుకునేరు.నాకు అనిపించిన నిజం చెప్తునానంతే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment