Friday 16 October 2009

దీపావళి



అందరికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే అందరికి గుర్తుకు వచ్చేది టపాకాయలు. ఇప్పుడంటే అందరు టపాకాయలు కొన్నుకుంటున్నారు కానీ, నా చిన్నప్పుడు
మా అన్నయవాళ్లు మతాబులు ,తారాజువ్వలు
ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు.
కాకరపోవుత్తులు ,సీమటపాకాయలు మిగతావి కొనుకున్నేవాళ్ళం. రెండు రోజుల ముందే అన్నయ వాళ్ళు కావాల్సిన మందు కొనుక్కోచ్చేవాళ్లూ.
తారాజువ్వల కోసం చిపూరు పుల్లలు ,మతలబులు చుట్టటానికి పాత పేపర్ లు కట్ చేసి పెట్టుకునేవాళ్ళు.
చిన్నపిల్లలం అని మమ్మలని దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు.
దూరం నుంచి చూస్తూ కూర్చునే వాళ్ళం. ఇంక పండగ రోజు తలంటు పోసుకుని సాయంత్రం ఎప్పుడవుతుందా
అని ఎదురుచూడ్డం,
ముందు రోజు తెచ్చిన టపాకాయలు ఎండలో పెట్టి కాపల వుండేవాళ్ళం.
ఎక్కడ వర్షం వచ్చి తడిసిపోతాయో అని!
సాయంత్రం పక్క వాళ్ళింట్లో టపాకాయల మోత వినగానే
మా ఇంట్లో యింకా మా అమ్మ
దీపాలు పెట్టడానికి చేసుకునే ఏర్పాట్లలో వుందని హడావుడి .
ముందు దీపాలు పెట్టి అమ్మవారికి పూజ చేస్తే కానీ టపాకాయలు కాల్చడానికి లేదు.

సాయంత్రం చక్కగా కొత్త బట్టలు వేసుకుని పూజ చేసుకొని ఇంటి ముందు దీపాలు పెట్టి ముందు ఒక కాకరపూవొత్తి కాల్చి
వెంటనే ఇంట్లో కి వెళ్లి
స్వీట్స్ తినేయడం.
ఆ తరువాత మిగిలిన టపాకాయలు కాల్చడం. ఇంక మా విధిలో ఎవరు ఎక్కువసేపు
కాల్చారో అని చూడడం.
అందులో ముఖ్యం 1000 వాల , 10ooo వాల సీమటపాకాయలు కాల్చడం.అది మొగినంత సేపు వీధిలో అందరు టపాకాయలు కాల్చడం ఆపి చూసే వాళ్ళం. ఇంకా ఆ తరువాత తారాజువ్వల సందడి. మా అన్నయలు దగ్గరుండీ వేయించేవాళ్ళు. ఒక్కోసారి అవి వేయడం రాకపోవడం తో కింద రోడ్ మీద డాన్స్ చేసేవి.మధ్య మధ్య లో చిచ్చుబుడ్దులు , విష్ణుచక్రాలు ,
మతాబులు,అగ్గి పెట్టలు,వెన్నముద్దలు అబ్బో చాలానే వున్నాయి సరదాలు.నీను 8 లో అనుకుంట ఒకసారి మరీ ధైర్యం ఎక్కువై విష్ణు చక్రం తిరగడం లేదని చేతిలో తీసుకుని దాన్ని చివర చూస్తున్న .
అది ఒక్కసారి పెలింది.చైయ్యంతా బొబ్బవచ్చేసింది .
అంతే యింక
మళ్ళి జన్మలో టపాకాయలు కల్చాకూడదనుకున్నా! అంతే యింక అప్పటినుంచీమతాబులు, కాకరపోవుత్తులు తప్ప ఏమి కల్చలేదు ఇప్పటివరకు.ఎంతైనా దీపావళి ప్రేత్యేకతే వేరు.




Friday 9 October 2009

ఆకాశమంతా

ఆకాశమంతా - ఈ సినిమా విడుదలైన చాల రోజుల తరవత అనుకోకుండా ఈ సినిమా చూసాను.అసలు సినిమా చూడకూడదు అనుకోవటానికి కారణం బొమ్మరిల్లు సినిమా.అందరికి బహుశా బొమ్మరిల్లు నచ్చి వుండవచ్చు .కానీ ఆ సినిమా నాకు నచ్చ లేదు.ఎందుకంటే సినిమాలో ఎంత సేపు పేరెంట్స్ తప్పు.పిల్లలని ఎక్కువ కరెక్ట్ అన్నట్టు వుంటుంది.సరే నేను రాయలనుకుంది ఆకాశమంతా గురించి కాబ్బట్టి ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. ఇకపోతే సినిమాలో త్రిషని గారాబంగా పెంచే తండ్రి ప్రకాష్ రాజ్.కానీ కూతురి జీవతంలో జరిగే ముఖ్యమైన సంఘటనా అతని ప్రేమేయం ఏమిలేకుండానే జరగుతుంది.కనీసం తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా త్రిషా చేయదు.

అసలు డైరెక్టర్ ఎం చెప్పదలుచుకున్నాడు?పిల్లలు ప్రేమిస్తే తల్లి తండ్రుల్ని పట్టించుకోనవసరం లేదనా?లేకా తల్లి తండ్రులు వారి జీవితాల్ని వారికీ వదిలేసి జరిగేవాటిని మౌనంగా స్వీకరించమనా? పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారిని ఎంత జాగ్రత్తగా పెంచుతారు?ప్రతి విషయంలో ఎన్ని సార్లు ఆలోచిస్తారు? అటువంటి పేరెంట్స్ కి మనం యిచ్చే గౌరవం ఏంటి?

సరే పెళ్లి అనేది చాల ముఖ్యమైన సంఘటన.నచ్చని వారిని చేసుకోలేము.కానీ నచ్చినవారిని చేస్కోవలనుకున్నప్పడు

కనీసం తండ్రికి ఆ విషయం అర్థమ్యవరకూ వేచి వుండాలనే ఆలోచనే వుండదు.ఎంత సేపు తండ్రికి నేను చేసేది కరెక్ట్.మీరు నాకూ చెప్పకర్లేదు అనే రీతిలో వుంటుంది.ఇటువంటి సినిమా చుసిన పిల్లలు ఏం ఆలోచిస్తారు? మనం చేసే

పని తల్లి తండ్రులకి చెప్పనవసరం లేదనేగా? కనీసం పెళ్లి ఏ రోజు చేసుకోవాలనుకుంటందో కూడా తండ్రితో అడగడం మానే కనీసం అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయదు.నేను ఫలానా roju పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అంటే డైరెక్టర్ ఇది ఆమె individuality అని చెప్పటమా?individuality అంటే తండ్రికి కూడా తన జీవితం లో జరిగే విషయాలు తెలుసుకునే హక్కు లేకపోవడమా?

నా వరకు నేను ఒక తండ్రికి కూతురుగా ఏ మాత్రం చేయలేని పని. మా నాన్న సలహా లేకుంటే నేను బహుశా ఈ రోజు నా జీవితం లో నాది అనే ఒక స్థానం ఏర్పరుచుకుని వుండేదాన్ని కాదేమో.ఇప్పటికి ఎదైనా సంఘటనా గురించి బాధపడినా ,భయపడినా మా నాన్న ఎంతో సపోర్ట్ చేస్తారు.ప్రతి విషయం పట్ల సహనం,సంయమనం,తొందరపడకపోవడం మా నాన్న నాకు నేర్పిన విషయాలు .

నేనే కాదు తండ్రిని ప్రేమించే ఈ అమ్మాయికి ఈ సినిమా బహుశా నచ్చి వుండదేమో? ఇలాంటి సినిమాల వల్ల పిల్లలు తల్లి తండ్రులకు individulity పేరిట గౌరవం ,ప్రేమ అభిమానాలను చూపటం కంటే తమ అవసరాలు తీర్చే వ్యక్తులగానే తల్లితండ్రులని చుపించడం జరిగింది అనిపించింది.తల్లి తండ్రులను కూడా ఆ ప్రకాష్ రాజ్ లాగా సర్దుకుపోవలనే విధంగానే ట్యూన్ చేస్తున్నారనిపించింది.