Friday, 8 October 2010

నా సోద

చాల రోజులునుంచి నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. పాటలు అందరు వింటుంటారు.మనసుకు నచ్చిన పాట ఒక్కోసారి అనుకోకుండా మన నోటి వెంట వస్తూ వుంటుంది. అలాంటప్పుడు మన పక్కన్న ఎవరున్నారు,మనం బాగా పాడగలమా? అనే అలోచన వుండదు . అదే బయట ఎక్కడో అయితే నలుగరు వున్నారు అని ఆలోచిస్తాం.ఇల్లు అనగానే మనది అనే ధ్యాసలో పడుకుంటాం.ఇక్కడే వచ్చింది సమస్య.అందరు బాగా పాడగలిగితే అందరు SP.బాలు, సుశీల ఎందుకట?కర్మ కాలి మనింట్లో కాస్త పాడే వాళ్ళు వున్నారంటే ఇక చుడండి పొరపాటున మనం ఎప్పుడైనా పాడితే

ఇక అంతే ఏదో ఒకటి అనేస్తారు.మనం బాధ పడతాం అని వుండదు.కనీసం బయట వాళ్ళైనాసర్దూకుంటారేమోకాని మన వాళ్ళు అసలు ఆగారు.అక్కడికి వాళ్ళే ఏదో సంగీతాన్ని కాపడుతున్న శంకరాభరణం శంకరశాస్త్రి లాగగా ఫీల్ అయ్యి lecture మొదలు పెడతారు.ఎందుకు పాడామురా అని గింజుకూవల్సిందే

. ఇది అంతా ఎందుకు చెప్తున్నంటే మా ఇంట్లో జరిగేదే కాబ్బట్టి . నాకు పాడటం సరిగ్గా రాదు ఏదో టీవీ లో వచ్చినప్పుడు దాని వెనకాల పాడుకుంటూవుంటా .ఇదివరుకు మా చెల్లి మాత్రమే నాకు ఈ lecture ఇచేదే.ఇప్పుడు దానికి తోడు మా శ్రీవారు కూడా చేరారు.ఇక వాళ్ళిద్దరూ లేని టైం చూస్కుని పాడలిసి వష్తుంది.ఎం చేస్తాం ?వాక్స్వతంత్రం ఉన్నట్లే పాటలు పాడుకోవడానికి కూడా వుంటే ఎంత బాగుండు?

Wednesday, 6 October 2010

అనుకుంటాం కాని నిజమే!

ఈ మధ్య సాక్షి పేపర్ లో ఒక కధ చదివా .అందులో భార్య ఇంట్లో పెళ్లి కి వెళ్లి వస్త్తున్న భర్త అత్తగారింట్లో జరిగిన అమర్యాదకు భార్యని కోపడతుంటాడు. అదేమిటో కాని అల్లుడి హోదా నూటికి 99 మంది కాదు కోటిమందిలో ఒక్కడు కూడా వెలగబెట్ట కుండ ఉండలేరు. ఎంత మర్యాదచేసిన వాళ్ళకి ఏదో ఒక వంక దొరుకుతుంది అత్తగారి వాళ్లన్ను సాధించడానికి . అతడు సినిమాలో బ్రహ్మనందం పాత్ర కొంత అతిశయొక్తిగా అనిపించినా కానీ చాల మంది అలాగే వుంటారు.మా freind ది మేనరికం ఐన సరే వాళ్ళాయన వాళ్ళ అత్తాగారి వంటకు వంకలు పెడతారంట .తను ఎంత చేత్తగా చేసిన మాట్లాడకుండా తిన్తారట.కాలం ఎంత మారిన ఇంకా పాతకాలపు అలవాట్లనుండి ఎందుకు దూరం కారో అర్దం కాదు. ఆడవాళ్ళకి సమానా హక్కులు కోర్టులో కాదు సమాజంలో రావాలి. ఇలా అన్నంత మాత్రనా నేనేదో ఫెమినిస్టు అనుకునేరు.నాకు అనిపించిన నిజం చెప్తునానంతే.