Friday, 9 October 2009

ఆకాశమంతా

ఆకాశమంతా - ఈ సినిమా విడుదలైన చాల రోజుల తరవత అనుకోకుండా ఈ సినిమా చూసాను.అసలు సినిమా చూడకూడదు అనుకోవటానికి కారణం బొమ్మరిల్లు సినిమా.అందరికి బహుశా బొమ్మరిల్లు నచ్చి వుండవచ్చు .కానీ ఆ సినిమా నాకు నచ్చ లేదు.ఎందుకంటే సినిమాలో ఎంత సేపు పేరెంట్స్ తప్పు.పిల్లలని ఎక్కువ కరెక్ట్ అన్నట్టు వుంటుంది.సరే నేను రాయలనుకుంది ఆకాశమంతా గురించి కాబ్బట్టి ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. ఇకపోతే సినిమాలో త్రిషని గారాబంగా పెంచే తండ్రి ప్రకాష్ రాజ్.కానీ కూతురి జీవతంలో జరిగే ముఖ్యమైన సంఘటనా అతని ప్రేమేయం ఏమిలేకుండానే జరగుతుంది.కనీసం తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా త్రిషా చేయదు.

అసలు డైరెక్టర్ ఎం చెప్పదలుచుకున్నాడు?పిల్లలు ప్రేమిస్తే తల్లి తండ్రుల్ని పట్టించుకోనవసరం లేదనా?లేకా తల్లి తండ్రులు వారి జీవితాల్ని వారికీ వదిలేసి జరిగేవాటిని మౌనంగా స్వీకరించమనా? పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారిని ఎంత జాగ్రత్తగా పెంచుతారు?ప్రతి విషయంలో ఎన్ని సార్లు ఆలోచిస్తారు? అటువంటి పేరెంట్స్ కి మనం యిచ్చే గౌరవం ఏంటి?

సరే పెళ్లి అనేది చాల ముఖ్యమైన సంఘటన.నచ్చని వారిని చేసుకోలేము.కానీ నచ్చినవారిని చేస్కోవలనుకున్నప్పడు

కనీసం తండ్రికి ఆ విషయం అర్థమ్యవరకూ వేచి వుండాలనే ఆలోచనే వుండదు.ఎంత సేపు తండ్రికి నేను చేసేది కరెక్ట్.మీరు నాకూ చెప్పకర్లేదు అనే రీతిలో వుంటుంది.ఇటువంటి సినిమా చుసిన పిల్లలు ఏం ఆలోచిస్తారు? మనం చేసే

పని తల్లి తండ్రులకి చెప్పనవసరం లేదనేగా? కనీసం పెళ్లి ఏ రోజు చేసుకోవాలనుకుంటందో కూడా తండ్రితో అడగడం మానే కనీసం అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయదు.నేను ఫలానా roju పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అంటే డైరెక్టర్ ఇది ఆమె individuality అని చెప్పటమా?individuality అంటే తండ్రికి కూడా తన జీవితం లో జరిగే విషయాలు తెలుసుకునే హక్కు లేకపోవడమా?

నా వరకు నేను ఒక తండ్రికి కూతురుగా ఏ మాత్రం చేయలేని పని. మా నాన్న సలహా లేకుంటే నేను బహుశా ఈ రోజు నా జీవితం లో నాది అనే ఒక స్థానం ఏర్పరుచుకుని వుండేదాన్ని కాదేమో.ఇప్పటికి ఎదైనా సంఘటనా గురించి బాధపడినా ,భయపడినా మా నాన్న ఎంతో సపోర్ట్ చేస్తారు.ప్రతి విషయం పట్ల సహనం,సంయమనం,తొందరపడకపోవడం మా నాన్న నాకు నేర్పిన విషయాలు .

నేనే కాదు తండ్రిని ప్రేమించే ఈ అమ్మాయికి ఈ సినిమా బహుశా నచ్చి వుండదేమో? ఇలాంటి సినిమాల వల్ల పిల్లలు తల్లి తండ్రులకు individulity పేరిట గౌరవం ,ప్రేమ అభిమానాలను చూపటం కంటే తమ అవసరాలు తీర్చే వ్యక్తులగానే తల్లితండ్రులని చుపించడం జరిగింది అనిపించింది.తల్లి తండ్రులను కూడా ఆ ప్రకాష్ రాజ్ లాగా సర్దుకుపోవలనే విధంగానే ట్యూన్ చేస్తున్నారనిపించింది.

12 comments:

మురళి said...

కథని ప్రకాష్ రాజ్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి చెప్పడం వల్ల వచ్చిన సమస్యండీ ఇది.. త్రిష పాయింటాఫ్ వ్యూ నుంచి కూడా కొంత కథ చెప్పి ఉంటే మరింత క్లారిటీ ఉండేది.. సినిమాలో ఇంకా చాలా లోపాలున్నాయి.. బట్, ఈ మధ్య వస్తున్నా సినిమాల్లో కాస్త చూడదగ్గ సినిమా (ఫ్యామిలీతో)..

Viswanadh. BK said...

తల్లి తండ్రులను కూడా ఆ ప్రకాష్ రాజ్ లాగా సర్దుకుపోవలనే విధంగానే ట్యూన్ చేస్తున్నారనిపించింది.

ఇప్పటి జనరేషన్ కొరకు తప్పదనుకొంటా, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. చేయాలనేది చేసేస్తారు కనుక తలిదండ్రులు ఎడ్జస్ట్ అవడం జరగాలి.

Anonymous said...

నాకు సినిమా లో ఏం తప్పు కనిపించలేదు........"మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నాన్నా...జోగి కి చెబుతాను...అతను అర్థం చేసుకుంటాడు" అనే డైలాగు కూడా ఉంటుంది...పిల్లలు ఏం చెబితే దానికి పెద్దలు తల ఆడించాలి అని కాదు....ఒక వయసు వచ్చాక వాళ్ళని పెద్దలు నమ్మాలి....ఆ నమ్మకం పిల్లలు కలిగించాలి....ఇది ఆ సినిమా లో చెప్పాలనుకుంది....

Padmarpita said...

ఒక వయసు వచ్చాక వాళ్ళని పెద్దలు నమ్మాలి....
ఆ నమ్మకం పిల్లలు కలిగించాలి....
ఇది ఆ సినిమా లో చెప్పాలనుకుంది....అయితే ఓ.కె!

swapna@kalalaprapancham said...

enthina oka roju fix chesukoni a rojuna marriage ani chepadam baledu. migithavi anni bagunnayi.

Mauli said...

కనీసం పెళ్లి ఏ రోజు చేసుకోవాలనుకుంటందో కూడా తండ్రితో అడగడం మానే కనీసం అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయదు.


--------------------


avasaram ledu ...tarvatha prakash raj ni convince cheyyadaniki aa abbayi ki unna knowledge, PM tho intimacy choopinchaaru gaaa...mari aa amayi father ni adigithe adi peru ke avuthundi ..endukante ..aayana cheppe answers yevi aame ki leda athaniki suit avvavu ...ante father traditional marriage kavali anavachu ...

inkaa aa ammayi intiki vachi pelli chesikonnadi ...adi valla father ki ichina respect ani enduku anukoru ....simple ga kavalanukonnam ani chesikoni vachi cheppavachunu kadaaa?

Mauli said...

pedda vallu fix cheseppudu andaru khachitam ga cheppi chestunnara ..iddari ki?...ledu ...mari pillalu matram cheppaka pothe inni questions :D

swathi said...
This comment has been removed by the author.
swathi said...

harish:@thanks for ur comment but what i want to say is,as a duaghter trisha character failed to convince her father .Her father adjusts to jogi character.
padamarpita:@thankyou

swathi said...

Mauligaru:@ thanks for commenting.PM tho matldatam anedi pelli fix aina tharavta jarge scene.kani tanu preminche abbayi character gurinchi atleast she should make her father understand and should give him time .Even she dont give any chance for him to make any discussion on her marrige arrangement.
inkapelli chesukuni vahci cheppe valla gurinche antara nijamga parents istapade vallu evaru ala cheyarau anukutna
finally a coin has always two sides.peddavallu chese pellilu anni manchi cheshtuanrani nenu chepppatledu.but we have some minimum responsibilty to make our parents to understand antunna.

swathi said...

murali garu;@ thanks for ur comments andi.may be your correct.aa vidhamaga alochiste konta confusion vundadu.
viswanthgaru:@ thanks andi comment chesinanduku.idavruku cinemaloo parents ni koduku mida depend avakudadu anantu tesaru.ippudu parents tama pillala dagagra vundalani entha mandi korukutnunanru.aaa trend nunchi ippudu pillalu em cheisna sardukovali ane trend vasthundi.
swapna:@thanks

Mauli said...

@swathimadhav : kani tanu preminche abbayi character gurinchi atleast she should make her father understand and should give him time


ఈ సినిమా మొదటినుండి హీరోయిన్ని ఫాదర్ ఎక్కడా అర్ధం చేసికోడు . ఆ అమ్మాయి ఏమి కోరిన ఇదే సంఘర్షణ ..మర్చిపోయారా?

ఇలా ఆమె కి అలవాటు అయిపొయింది చెప్పకుండా నిర్ణయం తీసికోవడం. ఇంకా విశేషం ఏంటి అంటే, ఆ అమ్మాయి తల్లికి ఏమి ఇబ్బంది లేదు .అంటే తల్లి బాధ్యత లేకుండా ప్రవర్తించింది అనుకొంటున్నారా?