ఈ రోజు ఒక ఛానల్ లో వంగపండు రాసిన పాట గురించి ఒక చర్చ.నాకు వాళ్ళి ద్దరి గురించి సరిగ్గా తెలియదు.కానీ ఆ చర్చ జరగిన విధానం చుస్తే అది వంగాపండుగారిని విమర్శించటం కంటే YSR ని పోగాడటమే తప్పు అన్నా రీతిలో సాగింది.ఎన్ని మాట్లాడిన రాష్ట్రము లో రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతోమంది అభిమానం వున్నవారు వున్నారు.ఇంతకు ముందు ఎంత మంది పేదవారి గురించి సహాయం చేసారు? కమ్యూనిస్ట్ పార్టీ లో కమ్మునిసిం కి అర్థం తెలియకుండా వున్నవాళ్ళు చేర్తున్నారని అనిపిస్తుంది ఆవిడని చుస్తే. ఏది ఎలా వున్నా ఈ చర్చ అనేది కేవలమ ఏకపక్షం గా జరిగింది అనిపించింది. కేవలం YSR ని విమర్శించడనికే ఒక చర్చ పెట్టినట్టు వుంది. అందరు డిబేట్ చేయలేరు. వారి అభిప్రాయాల్ని సపోర్ట్ చేసుకోలేరు. మన అభిప్రాయాన్ని రుజువు చేసుకోనంత మాత్రాన తప్పు అని నిర్దారించడం సమంజసం కాదేమో ! వితండవాదం చేసే వారికీ అసలే చెప్పలేము. కార్యక్రమము అంతా కాల్ చేసినవారి అభి ప్రయలు తమకు కావలసింత వరకు వినిపించి మిగతాది కట్ చేయడం ఏక పక్షం గా జరిగిందనడానికి సాక్ష్యం.
ప్రజల భావాలకు అనుగుణంగా మీడియా మారుతుందా ?లేక తన భావాలకు ప్రజలని మారుస్తుందా?
మీడియాకే తెలియాలి .
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
స్వాతి గారూ, ఇప్పుడే మీ బ్లాగుకి రావడం.. టపాలనీ చదివేశాను.. పారిస్ విశేషాలు, అక్కడ మీరు జరుపుకున్న పండుగలూ అన్నీ చక్కగా రాశారు.. తరచూ రాస్తూ ఉండండి.. ఇక వంగపండు-దేవి విషయం.. ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఘోరం.. ఆయనకి మద్దతుగా కూడా ఎవరినీ మాట్లాడనివ్వలేదు చానల్ వాళ్ళు..
అన్నట్టు..మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి..దానివల్ల మీరు ఏ బ్లాగులో వ్యాఖ్య రాసినా మీ పేరు ద్వారా ప్రొఫైల్ లోకి, బ్లాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది బ్లాగుల పాఠకులకి..
మురళి గారి కామేంటే నాదీనూ...
muraligaru:@thanks you and thanks for the suggestion also.i ll try to keep my profile.
bhaskar ramaraju garu:@thanks to u also
Post a Comment