వేసవికాలం అంటే సెలవల్తో పాటు చాల విషయాలు గుర్తుకొస్తాయి .మామడిపళ్ళూ ,తాటిముంజలు,మల్లెపూలు.... మల్లెపూలు అంటేనే ప్రేత్యేకమైన అభిమానం . ముఖ్యంగా చిన్నప్పుడు సరదాపడి వేయించుకున్న పూలజడ.
ఇంటివాళ్ళకు ఆడపిల్లలు లేకపోవడంతో నన్నూ ,మాచెల్లినీ పిలిచి మరీ పులజడ వేసేవాళ్ళు.
ఇంటావిడని బామ్మగారు అనేవాళ్ళం . అప్పటికే ఆవిడకి 60 ఏళ్ళుకుడా ,ఆవిడ ఓపికగా కుర్చుని పూలజడ అల్లేది.ఇప్పుడంటే అందరు ఏ పెళ్ళికో ఫంక్షన్కొ షాపులో కొనుకొచ్చి అ గంట వేస్తున్నారు .బహుశా అప్పుడు కూడా పూలముర తీసి జడ చుట్టూ అల్లేసి పూలజడ అనిపిస్తున్నారు.కాని ఆవిడ చక్కగా ఒక విస్తారకుని తీసుకుని నిలువగా కట్ చేసి ఆ విస్తారుకి చక్కగా మల్లెపూలు,కనకాంబరాలు,మరువం కట్టి కుట్టేది.చిన్నపుడు మా జాడలు కూడా కొంచెం పెద్దవిగా వుండేవి.నాది ఇప్పుడు అంత పెద్దది కాదు కాని మా చెల్లిది యిప్పటికీ వాలు జడే. ఇద్దరం చక్కగా పూలజడ వేసుకుని లంగా జాకెట్ వేసుకుని ఫోటో దిగాలని కోరిక.మా నాన్నేమో ఆఫీసు నుంచి వచ్చీ మమ్మల్ని చూసి పల్లెటూరు వాళ్ళలాగ ఈ అవతారలేంటి అని చిరాకు పడేవారు .ఇంక బిక్కమోకలేసేవాళ్ళం. మా అమ్మప్పుడు ఏదో సర్ది చెప్పేది.ఇంక

ఫోటో కూడానా!
మొత్తం మీద అలా ఒకసారిఎప్పుడో ఫోటో కూడా తెయించుకుని ఆ కోరికా నేరెవేర్చుకున్నం .కాని అ ఫోటో యిప్పుడు మా అన్న్నయ వాళ్ళింట్లో అల్బుంలో పెట్టేయడం తో అది మాఇంట్లో లేకుండా పోయింది.ఎప్పటికైనా అది జాతీయం చేయాలనీ నా చిరకాల వాంఛ ఎందుకంటే అది మాములుగా అడిగితే ఇవ్వడం లేదు.ఆ తరవాత చాలా ఏళ్ళకి మొన్న నా పెళ్లి లో వేసుకున్న కానీ అ గంటా భరింఛటం చాల కష్టమైపాయింది .కానీ ఎంతైనా చిన్నపుడువున్నా సరదానే వేరు.
4 comments:
మల్లెలు,కనకాంబరాలు,గులాబీలు వున్న పూల జడ పర్వాలేదు.కానీ చామంతుల పూలజడ మోయడం .....అమ్మో ..ఆ బరువు ఇప్పటికీ నన్ను భయపెడుతుంది :) ఫొటోలోని జడ భలే వుంది.
ఇబ్బంది లేకపోతే వర్డ్ వెరిఫికేషన్ తీసేయరూ.
అవునా? నేనెప్పుడు ట్రై చెయ్యలేదు.వర్డ్ వెరిఫికేషన్ తీసేసానండి.
thnaku radhikagaaru
నాకూ చిన్నప్పుడు పూలజడ భలే ఇష్టం ! వేసవిలో మల్లెలతో , తర్వాత చామంతులూ , కారబ్బంతులూ కలిపి ...ఎంత బరువైనా మోసేసేదాన్ని :)
ఏం పూలోగానీ జడ భలే ఉందండీ
Post a Comment