Tuesday, 18 August 2009

తలుచుకుంటే నోరూరుతుంది....



చిన్నపుడు ఎండా కాలం అంటే సెలవల్తో పాటు పచళ్ళు కూడా గుర్తుకొచ్చేవి.ఆవకాయ మాగాయ కంటే కొంచెముందుగనే ఉసిరికాయ,చింతకాయ,పండుమిరప దొరకడం తో వాటిని తొక్కు చేసి సంవత్సరం సరిపడా వుంచేది మా అమ్మ.
ఇప్పుడంటే నిల్వ పచ్చళ్ళు తింటే అరగడం
లేదని మానేసింది గాని.అసలు అవి కొనడానికి మార్కెట్ కి వెళ్ళడం తేవడం, తెచ్చినవి
కడిగి అరబెట్టటం చాల సరదాగా వుండేది .అన్నిట్లొన పండుమిర్పకాయ పచ్చడి తెగ నచ్చేది నాకు .ఎర్రటి పండుమిర్పకాయ పచ్చడి వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన వెన్నపూస వేసుకొని నోట్లో ఒక్కమొద్దా తిన్టూ వెన్నపూస నంచుకుంటే అబ్బో బ్ర్మహండం. అసలు ఇలా తినాలని కూడా మా నాన్నె చెప్పారు.తరవత్త దినీ మీద మనసుతో ఇది ఎలా చేయాల్లో నేర్చుకున్న .

ఈ పచ్చడి మిక్సీలో వేయడం వేస్ట్.చక్కగా రోట్లో చేస్తే అసలు taste బయటకు వస్తుంది.చక్కగా మెంతులు వేయించుకుని రోట్లో పౌడర్ చేసుకుని ,పండుమిరపకాయల తొక్కు ,కొద్దిగా చింతపండు, వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాక అంత నునే తో తాలింపు పెడితే చాల బాగుంటుంది.కానీ ఇది తిన్న తర్వాత బాగా పెరుగన్నం లేదా మజ్జిగ తినాలి లేకపోతే బాగా వేడి చేస్తుంది. తల్చుంటేనే నాకు నోరూరుతోంది,ఇవ్వాలో రేపో చేస్కుని తినాలి.అద్నమాట సంగతి.

3 comments:

మంచు said...

తినండి... మీరొక్కళ్ళె తినండి... ఎవ్వరికి పెట్టొద్దు... :-))
ఇలా నోరు వూరించి , నేను చెసుకుని తినాలి అనడం చాలా అన్యాయం. పండు మిరపకాయ పచ్చడి ప్రియా వాడిది కొన్నా వెన్నపూస దొరకదే?

kiranmayi said...

మీరు చేసుకుని తినాలా? ఇంకా నయ్యం.
ఇలా మీరు చేసుకుని తినేయ్యకపోతే, మమ్మల్ని కూడా కొంచెం పిలవచ్చు కదా? హన్నా.
ఫోటో మాత్రం బ్రహ్మాండం.

swathi said...

మంచుపల్లకి@; మాకు ఇక్కడ అదే ప్రాబ్లం.సో పచ్చడి తో సర్దుకుంటున్నాన్నండి.
కిరణ్మయి@; అయ్యో తప్పకుండా రండి.