Thursday, 31 December 2009

HAPPY NEW YEAR




Wish You All
A Happy & Prosperous New Year





Tuesday, 29 December 2009

చాల రోజులకు

అబ్బ !మొత్తానికిమీద నేను చాలా రోజుల తరవాత బ్లాగ్ రాస్తున్న.ఇన్ని రోజులు ఎందుకు రాయలేదంటే నేను మావూరు విజయవాడ వెళ్లి వచ్చాను . బహుశా సంవత్సరన్నర తరవాత మా ఇంటికి వెళ్ళను. నా లైఫ్లొ ఇంతకాలం మా ఇంటి కి దూరంగా లేను.పెళ్లి అయ్యాక తప్పలేదు.దూరం అనేమాటే కానీ , ఎంత దురం లో వున్నా మా వాళ్ళని రోజు webcam లో చూడటం తో అంత బెంగ అనిపించలేదు.
ఇంకా నా ఇండియా విశేషాలలో ముఖ్యమైనది ఒకటి వుంది.ఈసారి అనుకోకుండా నేను శ్రీశైలం చూసాను.శ్రీశైలం చూడటం ఇదే మొదటిసారి. చాల ప్రశాంతంగా బాగుంది . ఇంకా టైం అసలు సరిపోలేదు .అంత హడావిడి ప్రయాణాలు.అటు మా అత్తగారింట్లొ వారం ,ఇక్కడో వారం అంతే మిగతా రోజులు ప్రయాణపు బడలికకి రెండురోజులు,మళ్ళి బయలుదేరడానికి కావలిసిన షాపింగ్ .అర్థమే కాలేదు ఎలా వెళ్ళానో ఎలా వచ్చానో. అంత హడావిడిగా జరిగింది.
ఇక్కడకు వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే మా అమ్ముమ్మ expire అయ్యారని.నేను వున్నా నాలుగు రోజులుమా ఇంట్లోనే వుంది. ఇక్కడకు రాగానే ఈ news విన్న. సెటిల్ కావడానికి ఒక 1 వీక్ పట్టింది. తనకోసమే వెళ్లినట్టు వుంది . ఎంత బాగా చుస్కునేదో మమ్మల్ని. అందరిని పేరు పేరున ఫోన్ చేసి పలకరించేది.పండుగ ,పుట్టినరోజు ఏదైనా సరే తప్పకుండా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేది. ఆ ఆత్మీయత మర్చిపోలేనిది.నేను ఇంకా నమ్మలేకపోతుంది .ఇంకా మామయ్య వాళ్ళింట్లో వుంది అనే అనిపిస్తోంది. ఈ year నాకు సంతోషం బాధ రెండూ యిచ్చింది .ఒకటి నేను conceive అవడం.రెండూ మా అమ్ముమ్మ పోవడం.సంవత్సరం వెళ్ళిపోతోంది.కాలం ఎంత వేగంగా వుందో అనిపిస్తోంది.

Friday, 16 October 2009

దీపావళి



అందరికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే అందరికి గుర్తుకు వచ్చేది టపాకాయలు. ఇప్పుడంటే అందరు టపాకాయలు కొన్నుకుంటున్నారు కానీ, నా చిన్నప్పుడు
మా అన్నయవాళ్లు మతాబులు ,తారాజువ్వలు
ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు.
కాకరపోవుత్తులు ,సీమటపాకాయలు మిగతావి కొనుకున్నేవాళ్ళం. రెండు రోజుల ముందే అన్నయ వాళ్ళు కావాల్సిన మందు కొనుక్కోచ్చేవాళ్లూ.
తారాజువ్వల కోసం చిపూరు పుల్లలు ,మతలబులు చుట్టటానికి పాత పేపర్ లు కట్ చేసి పెట్టుకునేవాళ్ళు.
చిన్నపిల్లలం అని మమ్మలని దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు.
దూరం నుంచి చూస్తూ కూర్చునే వాళ్ళం. ఇంక పండగ రోజు తలంటు పోసుకుని సాయంత్రం ఎప్పుడవుతుందా
అని ఎదురుచూడ్డం,
ముందు రోజు తెచ్చిన టపాకాయలు ఎండలో పెట్టి కాపల వుండేవాళ్ళం.
ఎక్కడ వర్షం వచ్చి తడిసిపోతాయో అని!
సాయంత్రం పక్క వాళ్ళింట్లో టపాకాయల మోత వినగానే
మా ఇంట్లో యింకా మా అమ్మ
దీపాలు పెట్టడానికి చేసుకునే ఏర్పాట్లలో వుందని హడావుడి .
ముందు దీపాలు పెట్టి అమ్మవారికి పూజ చేస్తే కానీ టపాకాయలు కాల్చడానికి లేదు.

సాయంత్రం చక్కగా కొత్త బట్టలు వేసుకుని పూజ చేసుకొని ఇంటి ముందు దీపాలు పెట్టి ముందు ఒక కాకరపూవొత్తి కాల్చి
వెంటనే ఇంట్లో కి వెళ్లి
స్వీట్స్ తినేయడం.
ఆ తరువాత మిగిలిన టపాకాయలు కాల్చడం. ఇంక మా విధిలో ఎవరు ఎక్కువసేపు
కాల్చారో అని చూడడం.
అందులో ముఖ్యం 1000 వాల , 10ooo వాల సీమటపాకాయలు కాల్చడం.అది మొగినంత సేపు వీధిలో అందరు టపాకాయలు కాల్చడం ఆపి చూసే వాళ్ళం. ఇంకా ఆ తరువాత తారాజువ్వల సందడి. మా అన్నయలు దగ్గరుండీ వేయించేవాళ్ళు. ఒక్కోసారి అవి వేయడం రాకపోవడం తో కింద రోడ్ మీద డాన్స్ చేసేవి.మధ్య మధ్య లో చిచ్చుబుడ్దులు , విష్ణుచక్రాలు ,
మతాబులు,అగ్గి పెట్టలు,వెన్నముద్దలు అబ్బో చాలానే వున్నాయి సరదాలు.నీను 8 లో అనుకుంట ఒకసారి మరీ ధైర్యం ఎక్కువై విష్ణు చక్రం తిరగడం లేదని చేతిలో తీసుకుని దాన్ని చివర చూస్తున్న .
అది ఒక్కసారి పెలింది.చైయ్యంతా బొబ్బవచ్చేసింది .
అంతే యింక
మళ్ళి జన్మలో టపాకాయలు కల్చాకూడదనుకున్నా! అంతే యింక అప్పటినుంచీమతాబులు, కాకరపోవుత్తులు తప్ప ఏమి కల్చలేదు ఇప్పటివరకు.ఎంతైనా దీపావళి ప్రేత్యేకతే వేరు.




Friday, 9 October 2009

ఆకాశమంతా

ఆకాశమంతా - ఈ సినిమా విడుదలైన చాల రోజుల తరవత అనుకోకుండా ఈ సినిమా చూసాను.అసలు సినిమా చూడకూడదు అనుకోవటానికి కారణం బొమ్మరిల్లు సినిమా.అందరికి బహుశా బొమ్మరిల్లు నచ్చి వుండవచ్చు .కానీ ఆ సినిమా నాకు నచ్చ లేదు.ఎందుకంటే సినిమాలో ఎంత సేపు పేరెంట్స్ తప్పు.పిల్లలని ఎక్కువ కరెక్ట్ అన్నట్టు వుంటుంది.సరే నేను రాయలనుకుంది ఆకాశమంతా గురించి కాబ్బట్టి ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. ఇకపోతే సినిమాలో త్రిషని గారాబంగా పెంచే తండ్రి ప్రకాష్ రాజ్.కానీ కూతురి జీవతంలో జరిగే ముఖ్యమైన సంఘటనా అతని ప్రేమేయం ఏమిలేకుండానే జరగుతుంది.కనీసం తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా త్రిషా చేయదు.

అసలు డైరెక్టర్ ఎం చెప్పదలుచుకున్నాడు?పిల్లలు ప్రేమిస్తే తల్లి తండ్రుల్ని పట్టించుకోనవసరం లేదనా?లేకా తల్లి తండ్రులు వారి జీవితాల్ని వారికీ వదిలేసి జరిగేవాటిని మౌనంగా స్వీకరించమనా? పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారిని ఎంత జాగ్రత్తగా పెంచుతారు?ప్రతి విషయంలో ఎన్ని సార్లు ఆలోచిస్తారు? అటువంటి పేరెంట్స్ కి మనం యిచ్చే గౌరవం ఏంటి?

సరే పెళ్లి అనేది చాల ముఖ్యమైన సంఘటన.నచ్చని వారిని చేసుకోలేము.కానీ నచ్చినవారిని చేస్కోవలనుకున్నప్పడు

కనీసం తండ్రికి ఆ విషయం అర్థమ్యవరకూ వేచి వుండాలనే ఆలోచనే వుండదు.ఎంత సేపు తండ్రికి నేను చేసేది కరెక్ట్.మీరు నాకూ చెప్పకర్లేదు అనే రీతిలో వుంటుంది.ఇటువంటి సినిమా చుసిన పిల్లలు ఏం ఆలోచిస్తారు? మనం చేసే

పని తల్లి తండ్రులకి చెప్పనవసరం లేదనేగా? కనీసం పెళ్లి ఏ రోజు చేసుకోవాలనుకుంటందో కూడా తండ్రితో అడగడం మానే కనీసం అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయదు.నేను ఫలానా roju పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అంటే డైరెక్టర్ ఇది ఆమె individuality అని చెప్పటమా?individuality అంటే తండ్రికి కూడా తన జీవితం లో జరిగే విషయాలు తెలుసుకునే హక్కు లేకపోవడమా?

నా వరకు నేను ఒక తండ్రికి కూతురుగా ఏ మాత్రం చేయలేని పని. మా నాన్న సలహా లేకుంటే నేను బహుశా ఈ రోజు నా జీవితం లో నాది అనే ఒక స్థానం ఏర్పరుచుకుని వుండేదాన్ని కాదేమో.ఇప్పటికి ఎదైనా సంఘటనా గురించి బాధపడినా ,భయపడినా మా నాన్న ఎంతో సపోర్ట్ చేస్తారు.ప్రతి విషయం పట్ల సహనం,సంయమనం,తొందరపడకపోవడం మా నాన్న నాకు నేర్పిన విషయాలు .

నేనే కాదు తండ్రిని ప్రేమించే ఈ అమ్మాయికి ఈ సినిమా బహుశా నచ్చి వుండదేమో? ఇలాంటి సినిమాల వల్ల పిల్లలు తల్లి తండ్రులకు individulity పేరిట గౌరవం ,ప్రేమ అభిమానాలను చూపటం కంటే తమ అవసరాలు తీర్చే వ్యక్తులగానే తల్లితండ్రులని చుపించడం జరిగింది అనిపించింది.తల్లి తండ్రులను కూడా ఆ ప్రకాష్ రాజ్ లాగా సర్దుకుపోవలనే విధంగానే ట్యూన్ చేస్తున్నారనిపించింది.

Tuesday, 29 September 2009

వంగపండు-దేవి -చర్చా ఇది?

ఈ రోజు ఒక ఛానల్ లో వంగపండు రాసిన పాట గురించి ఒక చర్చ.నాకు వాళ్ళి ద్దరి గురించి సరిగ్గా తెలియదు.కానీ ఆ చర్చ జరగిన విధానం చుస్తే అది వంగాపండుగారిని విమర్శించటం కంటే YSR ని పోగాడటమే తప్పు అన్నా రీతిలో సాగింది.ఎన్ని మాట్లాడిన రాష్ట్రము లో రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతోమంది అభిమానం వున్నవారు వున్నారు.ఇంతకు ముందు ఎంత మంది పేదవారి గురించి సహాయం చేసారు? కమ్యూనిస్ట్ పార్టీ లో కమ్మునిసిం కి అర్థం తెలియకుండా వున్నవాళ్ళు చేర్తున్నారని అనిపిస్తుంది ఆవిడని చుస్తే. ఏది ఎలా వున్నా ఈ చర్చ అనేది కేవలమ ఏకపక్షం గా జరిగింది అనిపించింది. కేవలం YSR ని విమర్శించడనికే ఒక చర్చ పెట్టినట్టు వుంది. అందరు డిబేట్ చేయలేరు. వారి అభిప్రాయాల్ని సపోర్ట్ చేసుకోలేరు. మన అభిప్రాయాన్ని రుజువు చేసుకోనంత మాత్రాన తప్పు అని నిర్దారించడం సమంజసం కాదేమో ! వితండవాదం చేసే వారికీ అసలే చెప్పలేము. కార్యక్రమము అంతా కాల్ చేసినవారి అభి ప్రయలు తమకు కావలసింత వరకు వినిపించి మిగతాది కట్ చేయడం ఏక పక్షం గా జరిగిందనడానికి సాక్ష్యం.
ప్రజల భావాలకు అనుగుణంగా మీడియా మారుతుందా ?లేక తన భావాలకు ప్రజలని మారుస్తుందా?
మీడియాకే తెలియాలి .

Thursday, 3 September 2009

నివాళి

ఏది చీకటి ?ఏది వెల్తురు?ఏది జీవతం? ఏది మృత్యువు?
ఏది పుణ్యం? ఏది పాపం?ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం?ఏదసత్యం?ఏదనిత్యం?ఏది నిత్యం?
ఏది ఏకం?ఏది అనేకం?ఏది కారణం?ఏది కార్యం?
ఓ మహాత్మా !ఓ మహర్షి!
ఏది తెలుపు? ఏది నలుపు?ఏది గానం ?ఏది మౌనం?
ఏది నాది ?ఏది నీది?ఏది నీతీ?ఏది నేతి?
నిన్న స్వప్నం నేటి సత్యం.నేటి ఖేదం రేపు రాగం.
ఒకే కాంతి ,ఒకే శాంతి.
ఓ మహర్షి ! ఓ మహాత్మా!
---- శ్రీ శ్రీ

------------------------------------------
శ్రీ వైయస్. రాజశేఖర్ రెడ్డి గారికి మా అశ్రునివాళి .ఎన్నటికి ప్రజల హృదయాలలో చెరగని చిరు నవ్వుతో నిలచిన మానవత మూర్తి.పేదల పెన్నిది,వెనుదిరగని ధీరత్వమున్న వ్యక్తి .అయన లేని లోటు తీర్చలేనిది.

Tuesday, 25 August 2009

మా ఇంటి బొజ్జ గణపయ్య.




ఈ సారి వినాయక చవితికి spls
మూడు
వున్నాయి.


1. ఆదివారం కావడం తో మావారు ఇంట్లొ
వున్నారు. పండగ ఆదివారం రావాలని ఎవరు కోరుకోరు.కానీ ఇక్కడ మనపండగల్కి సెలవు వుండదు కాబట్టి మనం శలవరోజు పండగొస్తే బాగుంటుందినిపిస్తుంది .


2.మాకు ఈ సారి పాలవెల్లి దొరికింది.క్రితం సారి పాలవెల్లి లేకుండానే చేసాం.


౩.ఇంకా ఈ సారి మొదకాలు దేవుడికి spl నైవేద్యం అన్నమాట.


మొత్తం మీద హడావిడిగా కాకుండా ప్రశాంతంగా చేసుకున్న పండగ అన్నమాట. మా ఇంటి బొజ్జ గణపయ్యను చూడండి.


Wednesday, 19 August 2009

పూలజడ

వేసవికాలం అంటే సెలవల్తో పాటు చాల విషయాలు గుర్తుకొస్తాయి .మామడిపళ్ళూ ,తాటిముంజలు,మల్లెపూలు.... మల్లెపూలు అంటేనే ప్రేత్యేకమైన అభిమానం . ముఖ్యంగా చిన్నప్పుడు సరదాపడి వేయించుకున్న పూలజడ.
ఇంటివాళ్ళకు ఆడపిల్లలు లేకపోవడంతో నన్నూ ,మాచెల్లినీ పిలిచి మరీ పులజడ వేసేవాళ్ళు.
ఇంటావిడని బామ్మగారు అనేవాళ్ళం . అప్పటికే ఆవిడకి 60 ఏళ్ళుకుడా ,ఆవిడ ఓపికగా కుర్చుని పూలజడ అల్లేది.ఇప్పుడంటే అందరు ఏ పెళ్ళికో ఫంక్షన్కొ షాపులో కొనుకొచ్చి అ గంట వేస్తున్నారు .బహుశా అప్పుడు కూడా పూలముర తీసి జడ చుట్టూ అల్లేసి పూలజడ అనిపిస్తున్నారు.కాని ఆవిడ చక్కగా ఒక విస్తారకుని తీసుకుని నిలువగా కట్ చేసి ఆ విస్తారుకి చక్కగా మల్లెపూలు,కనకాంబరాలు,మరువం కట్టి కుట్టేది.చిన్నపుడు మా జాడలు కూడా కొంచెం పెద్దవిగా వుండేవి.నాది ఇప్పుడు అంత పెద్దది కాదు కాని మా చెల్లిది యిప్పటికీ వాలు జడే. ఇద్దరం చక్కగా పూలజడ వేసుకుని లంగా జాకెట్ వేసుకుని ఫోటో దిగాలని కోరిక.మా నాన్నేమో ఆఫీసు నుంచి వచ్చీ మమ్మల్ని చూసి పల్లెటూరు వాళ్ళలాగ ఈ అవతారలేంటి అని చిరాకు పడేవారు .ఇంక బిక్కమోకలేసేవాళ్ళం. మా అమ్మప్పుడు ఏదో సర్ది చెప్పేది.ఇంక
ఫోటో కూడానా!
మొత్తం మీద అలా ఒకసారిఎప్పుడో ఫోటో కూడా తెయించుకుని ఆ కోరికా నేరెవేర్చుకున్నం .కాని అ ఫోటో యిప్పుడు మా అన్న్నయ వాళ్ళింట్లో అల్బుంలో పెట్టేయడం తో అది మాఇంట్లో లేకుండా పోయింది.ఎప్పటికైనా అది జాతీయం చేయాలనీ నా చిరకాల వాంఛ ఎందుకంటే అది మాములుగా అడిగితే ఇవ్వడం లేదు.ఆ తరవాత చాలా ఏళ్ళకి మొన్న నా పెళ్లి లో వేసుకున్న కానీ అ గంటా భరింఛటం చాల కష్టమైపాయింది .కానీ ఎంతైనా చిన్నపుడువున్నా సరదానే వేరు.



Tuesday, 18 August 2009

తలుచుకుంటే నోరూరుతుంది....



చిన్నపుడు ఎండా కాలం అంటే సెలవల్తో పాటు పచళ్ళు కూడా గుర్తుకొచ్చేవి.ఆవకాయ మాగాయ కంటే కొంచెముందుగనే ఉసిరికాయ,చింతకాయ,పండుమిరప దొరకడం తో వాటిని తొక్కు చేసి సంవత్సరం సరిపడా వుంచేది మా అమ్మ.
ఇప్పుడంటే నిల్వ పచ్చళ్ళు తింటే అరగడం
లేదని మానేసింది గాని.అసలు అవి కొనడానికి మార్కెట్ కి వెళ్ళడం తేవడం, తెచ్చినవి
కడిగి అరబెట్టటం చాల సరదాగా వుండేది .అన్నిట్లొన పండుమిర్పకాయ పచ్చడి తెగ నచ్చేది నాకు .ఎర్రటి పండుమిర్పకాయ పచ్చడి వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన వెన్నపూస వేసుకొని నోట్లో ఒక్కమొద్దా తిన్టూ వెన్నపూస నంచుకుంటే అబ్బో బ్ర్మహండం. అసలు ఇలా తినాలని కూడా మా నాన్నె చెప్పారు.తరవత్త దినీ మీద మనసుతో ఇది ఎలా చేయాల్లో నేర్చుకున్న .

ఈ పచ్చడి మిక్సీలో వేయడం వేస్ట్.చక్కగా రోట్లో చేస్తే అసలు taste బయటకు వస్తుంది.చక్కగా మెంతులు వేయించుకుని రోట్లో పౌడర్ చేసుకుని ,పండుమిరపకాయల తొక్కు ,కొద్దిగా చింతపండు, వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాక అంత నునే తో తాలింపు పెడితే చాల బాగుంటుంది.కానీ ఇది తిన్న తర్వాత బాగా పెరుగన్నం లేదా మజ్జిగ తినాలి లేకపోతే బాగా వేడి చేస్తుంది. తల్చుంటేనే నాకు నోరూరుతోంది,ఇవ్వాలో రేపో చేస్కుని తినాలి.అద్నమాట సంగతి.

Friday, 14 August 2009

శుభోదయం

చిన్న చీమ దగ్గర్నుండి క్రిమికీటకాలు .జంతువులు అన్ని తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎంతో శ్రమపడుతున్నయి.అటువంటిది మనిషి పని చేయకుండా వురికే వచ్చే డబ్బుకోసం ప్రాకులడం ఎంత తప్పు ? .
సోమరితనం ఎంత తప్పు చక్కగా విశ్లేషిస్తూ దర్శకుడు కే.విశ్వనాద్ తీసిన శుభోదయం ఆణిముత్యం లాంటి సినిమా .


ఉద్యోగం వస్తే కష్టపడి పని చేయాలనీ అందుకు ఇష్టం పడడు chandramohan . రోజు ఇంట్లో ఉద్యోగం వెతుకోవటానికి వేళ్తూన్నని చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకుని కాలం గడిపేస్తూంటాడు ఒక రోజు అతనికి డబ్బున అమ్మాయితో పెళ్లి జరుగుతుందని ఒక చిలక జోస్యడు చెప్తాడు. ఇంతలొ అతనికి సులక్షణ ఒక పెళ్ళిలో కన్పడుతుంది.ఆమె డబ్బున అమ్మయి అని తెలుసుకొని ఆమె తో పరచయం పెంచుకుంటాడు . డబ్బున్న అమ్మయిని చేస్కుంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం వుండదని ఆశపడతాడు.కానీ సులక్షణ మాత్రం తండ్రి డబ్బు తో కాకుండా స్వశక్తితో సంపాదించే వాడిని చేసుకోవలునుకుంటుంది.ఆమె ఉద్యోగం చేసే ఆఫీసులోనే తను చేరతాడు . చంద్రమోహన్ వుద్దేశం తెలియని ఆమె అతడిని ఇష్టపడుతుంది. వారిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత ఆమె అతని గురించి తెలుసకుని మార్చాలని చూస్తుంది.మార్చలేక బాధపడుతుంది.ఐతే తను అనుకున్నాట్టు డబ్బు లేకపోవడంతో ఆమెను విడిచి వెళ్తాడు .పని చేయడం ఇష్టం లేని చంద్రమోహన్ ఒక అధ్యత్మిక అశ్రమంలో చేరతాడు వురికే భోజనమ దొరుకుతునుకుంటాడు.ఆ అశ్రమానికే సులక్షణ ఆస్తి ఆంతా రాసి ఇచ్చి అక్కడవుండటం చూసి ,తన కొడుకుని చూడడం తో అతనిలో మార్పూ వస్తుంది. తన తప్పు తెలుసుకుంటాడు భార్యను చేరుకుంటాడు .అ విధంగా అతని జీవితం లో శుభోదయం జరగుతుంది .


సోమరితనం కూడదు అన్నా సందేశం తో సాగే ఈ చిత్రం విశ్వనాధ్ గారు తీసిన చిత్రాలో ఎన్నదగినది.


ఈ సినిమాలో వేటూరి గారు రాసిన పాటలు ముఖ్యంగా "కంచికి పోతావా కృష్ణమ్మా.." ,"గంధము పూయరుగా.." చక్కని సంగీతం తో వినసొంపుగా వుంటాయి.ఈ చిత్రానికి సంగీతం కెవి.మహాదేవన్ గారు అందించారు. sp.బాలసుబ్రమణ్యం,సుశీల నేపద్యం ప్రాణం పోసారు.

చంద్రమోహన్ ,సులక్షణ,మనోరమ,చారుహాసన్,అన్నపూర్ణా ,రమణమూర్తి తదితరులు వారి పాత్రలను అద్భతంగా పొషించారు. చిత్రం 1980 లో శ్రీరామ ఆర్ట్స్ వారిచే విడులచేయబడినది.ch.నరసింహ రావు గారు దీనికీ నిర్మాత.


Thursday, 13 August 2009

కృష్ణాష్టమి




అసలు కృష్ణాష్టమి అంటే -hear hear ....అసలు కృష్ణాష్టమి అంటే-చెప్పండి సర్.....
అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణుడి bday అన్నమాట.
బాపుగారు తన Mr.పెళ్ళాం సినిమాలో కృష్ణాష్టమి బాగా చెప్పారు.నాకు తెలిసి ఏ తెలుగువారికైనా ముందుగ గుర్తుకోచేది ఈ dilouge అనుకుంట. బాపుగారి సినిమాలో కృష్ణాష్టమి చాల బాగా చూపిస్తారు.అయన గీసిన బాలకృష్నుడి బొమ్మలు ఎంత ముద్దోస్తాయి.నాకు అయన గిసిన దశావతరాలు కొనుక్కుని మా ఇంట్లో పెట్టుకోవాలని కోరిక .నాకు కృష్ణాష్టమి అనగానే శుభోదయం సినిమాలో గంధము పూయరుగా అనేపాట గుర్తుకొస్తుంది.అపట్లో dd లో శుక్రవారం పుట చిత్రలహరిలో ఈ పాట చూసాను.బహుశా అప్పుడే కొంచెం వుహ వస్తుందేమో నాకు ఈ పాట బగా గుర్తుండిపొయింది.
ఇక మా ఇంట్లో ఐతే మా అమ్మ కృష్ణాష్టమి కూడా పుజలగా చేస్తుంది.కానీ చిన్నప్పుడు మేము అద్దెకుండే ఇంటివళ్ళీంట్లొ కృష్ణాష్టమి చాల బాగా సరదాగా వుండేది.వాళ్ళింట్లో పెద్ద కృష్ణుడి బొమ్మ వుండేది.దానికి వాళ్ళు చక్కగా అలంకరించి పేరంటం చేసేవాళ్ళు.బాగా చిన్నతనం వల్లేమో అంతగా గుర్తులేదుకాని అ కృష్ణుడి బొమ్మబాగా గుర్హ్తునిది.ఇప్పుడు ఇంచుమించు అలాంటిదే మా ఇంట్లో కుడా వుంది. కానీ కృష్ణుడు అంటే మిగతా దేవుళ్ళ లాగ భక్తి కన్నా ఎందుకో ప్రేమ అనిపిస్తుంది.ఎంతైనా కృష్ణుడు ప్రేమమూర్తి కదా!

తీయ్యని మత్తున ముంచిన మురళిలొలుడు
మాయను దూరం చేసిన గితాచర్యుడు
అందుకే అతని కధ తరములు నిలిచెకదా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

ఎంతో చక్కని పాటల్లొ కృష్ణుడిని వర్ణించారు మన కవులు.
ఆనాటి పాండురంగ మహత్యం లోని కృష్ణ ముకుందామురారి నుండి ఎన్నో అద్భుతమైన
పాటలు ఎన్ని సార్లు విన్న తనివితీరదు .అ మహత్యం ఆ పాటలోని కృష్ణ మహిమ అంటే అతిశయోక్తి కాదేమో!

Thursday, 6 August 2009

రక్షా బంధన్- rakhi


రాఖి అంటే నాకు చాల ఇష్టం .నేను మా చెల్లి ఇద్దరం మా తమ్ముడికి రాఖి కట్టే వాళ్ళం.రాఖి చాల గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే వాళ్ళం కూడా.చిన్నపుడు మా పెద్దమ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే వుండే వాళ్ళు.వాళ్ళ కి నలుగురు పిలల్లు.ఇద్దరు అక్కలు.ఇద్దరు అన్నయలు.దాంతో మా తమ్ముడి తో పాటు అన్నయ్యలిద్దర్రికి మేము ఇద్దరం రాఖి కడితే అక్కలు ఇద్దరు మా తమ్ముడికి రాఖి కట్టే వాళ్ళు.మా అమ్మ ,పెద్దమ్మ కూడా మామయ్య కి రాఖి కట్టే వాళ్లు.మా తమ్మ్ముడికి ,అన్నయలిద్దరికి మొత్తం ౩.నేను మా చెల్లి ఇద్దరం కట్టాలి కదా అందుకని మొత్తం ఆరు .ఇది కాకుండా మా అమ్మ మామయ్య కి కట్టాలి కబ్బటి ఇంకోటి.మొత్తం 7 రాఖీలు కొనాలి.ఇక ముందు రోజు నేను మా చెల్లి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి వెళ్లి కొనుకుని వచ్చే వాళ్ళం .రాఖి రోజు పొద్దున్న స్కూల్ వుంటుంది కాబ్బట్టి సాయింత్రం రాఖి కట్టేవాళ్ళం. మా అమ్మ స్వీట్స్ తెప్పించేది.ఇక మా తమ్ముడ్కి మేము కట్టాక ,అన్నయలకి కట్టే వాళ్ళం .అలాగే అక్కవాళ్ళు కూడా తమ్ముడికి కట్టే వారు.ఇక్క రాఖి కట్టిం తరువాత చేతిలో బోలెడు డబ్బులు.(అసలు అందుకేగా రాఖి కట్టేది :)) మా అమ్మ ,పెద్దమ్మ మమ్మయ్య కి రాఖి కట్టే వాళ్ళు.అసలు ఎంత సందడిగా వుండేదో .
ఇప్పుడు పెళ్లి అయినాక నేను లండన్ రావడం మా తమ్ముడు job కోసం hydlo వుండడం మా చెల్లి vja లో వుండడం తో రాఖి కట్టలేక పోయాం.ఐన నేను వుర్కుంటాన! రాఖి పోస్ట్ చేశాను.రాఖి కట్ట లేదన్న ఫీలింగ్ తప్ప ఇంత దూరంగా వున్నా నాకెప్పుడు తోడుండే మా తమ్ముడు ,చెల్లి తోటి నేను చాల హ్యాపీ. i wish them a very happy and propserous life.
hey చిన్నారి,bobby
i love you
swathi

వరలక్ష్మి వ్రతం-london




నాకు పెళ్లి అయింతరవాత ఇది రెండో వరలక్ష్మివ్రతం. రెండు రోజుల ముందే వ్రతానికి కావలసిన ఏరుపాట్లు start చేశాను . నేను వుండటం ఇండియా కాదు కాబట్టి ముందు రోజు అన్ని తెచ్చుకోవాలంటే కుదరదు .ఎందుకంటే క్రితం సారి అనుభవం ఏంటంటే పూజకి తమలపాకులు దొరకలేదు.అమ్మవారికి మటుకు 5 ఆకులు దొరికాయి ఎలాగో.మేముండే apartments లో ఒక 15 మంది దాక తెలుగు వాళ్ళు వుంటారు.పెళ్లి అయినాక first వరలక్ష్మి వ్రతం కదా అని అందరిని పేరంటానికి పిలిచాను కానీ తమలపాకులు లేకుండానే తాంబూలం ఇవ్వాల్సి వచ్చింది.అది గుర్తు వచ్చి రెండు రోజులు ముందుగానే కావాల్సిన వస్తువులు కొనడం ప్రారంభించాను.మొత్తానికి పండుగ రోజు వచ్చింది.
శుక్రవారం నాడు పొద్దునే అంటే 5:౩౦ కి లేచి పని start చేశా .మావారిని పండుగ కదా ఆఫీసుకి ఒక గంట పర్మిషన్ పెట్టమని చెప్పా. పదింటికి పూజఅయిపోవాలి అని గట్ట్టిగా అనుకున్నా.అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టల్నుకోవటం తో 11 గంటలకి కానీ వంట పూర్తి కాలేదు. ఇంక అప్పుడు అమ్మవారి కలశం పెట్టుకుని, తోరణాలు వేసుకుని ,నా పూజ complete అయ్యేసరికి 12 అయ్యింది.మావారికి మటుకు ఒక 1 గంట పర్మిషన్ halfday లీవ్ గా మారింది.

ఇక అ రోజు సాయంత్రం చక్కగా పేరంటం చేసుకున్నాను.ఈసారి తమలపాకులు కుడా ఇచ్చాను తాంబూలం లోకి.అన్నిట్లోన మా చెల్లి నాకు తోడూ వుంటే చాల బాగుండేది అనిపించింది.ప్రతి year మా అమ్మ చెల్లి తో చేసుకోవడం అలవాటు . so వాళ్ళని బాగా miss అయ్యాను.

Wednesday, 24 June 2009

పారిస్-4


ఇంక అ రోజు రాత్రి మేము పారిస్ నగర వీధులని చూసాము.రాత్రిపూట పారిస్ విద్యుత్ దీపాలతో ఎంతో మనోహరంగా వుంది.పారిస్ లోని palace,సైనికుల కోసం కట్టబడిన భావనులు,ఈజిప్టు వారిచే బహుకరిచబడిన concorde square ,arc of france ,రాత్రి పుట చుస్తే ఆ భవనాల యెక్కో అందము వర్ణించటానికి మాటలు రావు. పారిస్ నగరం లోని ,EIFFEL టవర్ రాత్రి పుట లైట్లతో తో ఎంతో బావుంటుంది
చూడటానికి రెండు కళ్లు చాలవు.ఎంతో అందంగా వుంటుంది.మర్నాడు మేము పారిస్ రోడ్స్ మీద ప్రయణం సాగించాము .అక్కడి అలెగ్జాండర్ బ్రిడ్జి ఎంతో బాగుంటుంది,ఇంక సిఎన్ నది మీద బోటు షికారు తప్పక చేయవలసినవి.పారిస్ నగరం చరిత్రతిమికంగ వుంటుంది.ఇంక ముఖ్యం ఇక్కడ లువేర్స్ museum తప్పక చూడవలసినది. కానీ సమయం లేకపోవడం తో మేము చూడలేదు.ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన మోనాలిసా painting వుంది.ఇంకాఎన్నో విశేషాలు వున్నాయి.కానీ పారిస్ ప్రయాణం నా జీవితం లో ఒక మధుర స్మృతి.

Tuesday, 23 June 2009

paris-3


తర్వాత రోజు మేము disneyland
గడిపాము.ఒకాసారి నా వయస్సు పది సంవత్సరాలు ఐతే బాగుండు అనిపించింది.అక్కడ వున్నవారుఅందరూ ఒక్కసారి చినపిల్లలుగా మారిపోతారు.అందరు ఆడుతూ హుషురగా గడుపుతారు.అక్కడి అందాలూ వరిన్ణచటానికి నాకు మాటలు రావడం లేదు.ఎంతో అద్భుతమైన ప్రపంచం.ఒక చోట డిస్నీ ల్యాండ్ వారిచే organize చేయబడిన డాన్స్ షో జరుగుతోంది.అందులో కొంత మంది dancers డాన్స్ చేస్తారు.తర్వాత వారు చేసిన steps మనని కూడా చేయమని encourage చేస్తారు.అ drums beats ఎంతో వుత్సాహంగా వుంటాయంటే ఆ బీట్ లో మనన్ని మనం మర్చిపోయి steps వేస్తాము. దీనికీ ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక 60ఏళ్ళ మహిళా, ఆవిడా indian. ఆవిడ అ డాన్స్ కి rythm లో డాన్స్ చేయడం.రియల్లీ మనని మన చిన్నతాననికి తీసుకుని వెళ్ళే ఒక వింతయిన ప్రపంచం.ఇంక ఇది మొత్తం నాలుగు విభాలుగా విభజించబడింది.పెద్దవాళ్ళు ఇష్టపడే rides అన్ని advetnure isle గాను,పిల్లలు ఇష్టపడే fancy isle,ఇంక frontierland మరియు discoveryland.ఇది ఒక రోజులో చూసేది కాదు కానీ మేము maximum cover చేసాము.rides దగ్గర చాల టైం క్యూ లోనే సరిపోతుఅంది.క్యూ కాకుండా ముందే ticketmachine నుంచి తీసుకునే అవకాశం వుంది.మెషిన్ లో ఇచ్చన టైంకి మనం చేరుకుంటే సరిపోతుంది.ముందుగ మేము fancy land లో rides కి వెళ్ళాము.అక్కడ small వరల్డ్ అని ఒకటి చిన్న గుహలాంటి దాంట్లోకివుంటుంది.పిల్లల బొమ్ములు baarbii డాలస్ ,ఎన్నోరకాల cute dolls ఎన్నిటినో అందంగా లైట్స్ తో డెకరేట్ చేసి పెటారు.ఆ నీటి మీద మనము boatlo ప్రయాణిస్తూ చీకటి గుహలో అందమైన లైట్స్ తో వెలుగుతున్న బొమ్మలిని చూస్తూ మనసు ఒక్క క్షణం మనం ఐదు ఆరేళ్ళ పిల్లలుగా మారిపోయినట్టు వుంటాం,ఇంక fancy లాండ్లో ఇలాంటివి ఎన్నో అద్భుతాలు మనం ఆ క్షణం లో ఎంతో హుషారుని కలుగ చేస్తాయి.ఆ తరువాత adventure land లో ముఖ్యంగా pirates of carriebian,robinhood treehouse చూడవలసినవి .pirates of కరీబియన్ ఎంతో థ్రిల్లింగ్ గా వుంటుంది.సముద్రపు దొంగలు ,వారి జీవనం బొమ్మలతో అందంగా చూపిస్తారు.ఇదికూడా సొరంగం లాంటి మార్గంలో నీటి పై ప్రయాణం. ఎంతో ఆశ్చయ్రంగా ,exciting గా వుంటుంది.ఇంక frontier land లోని ట్రైన్ ,scaryworld ,adventure land లోని స్పేస్ షిప్ ఏంటో బాగుంటాయి.ఇంక డిస్నీ land గురించి నేను చెప్పింది 10%కూడా వుండదేమో.అంట అద్భుతమైన ప్రపంచం తప్పక చూసి తీరవలసిందే. i thank my husband a lot for this.

paris-2


మనము paris కి cali నుంచి వెళ్ళేదారిలో రహదారులు కానీ ప్రక్కన్న వుండే మైదానాలు కానీ ఎంతో అద్భుతంగా వుంటయి చూడటానికి.ఇంకో వింతయిన ద్రిశ్యం ఏమిటంటే ఈ దారిలో వెళ్తునప్పుడు మనము కరెంటు antenna లు చాల చూసే వుంటాం కానీ ఇక్కడ antenna లు డిజైన్ వింతగా వుంటయి.వాటిని చూసినప్పుడు అవి మనకి ఒక పిల్లి ముఖంను గుర్తుకు తెస్తాయి.అన్ని అలాగే వుంటాయి.వాళ్ళఅలా ఎందుకు డిజైన్ చేసారో కానీ అన్నిటికి రెండు కళ్లు ఒక ముక్కు రెండూ చెవులు వున్నట్టు చూడగానే పిల్లి గుర్తుకు వస్తుంది. అలా మనము ఈ వింతల్ని చూస్తుండగానే మనము paris నగరం లోకి ప్రవేశిస్థాము. paris లోకి ప్రవేశించగానే మనకి ముందుకనిపించేవి ఎత్తెన భవనాలు వాటి ఫై వివిధ కంపనీ ల హోర్డింగ్స్.ఇవి రాత్రి lights తో డెకరేట్ చేయబడి,నగరమంతా ప్రకాశిస్తూ ఒక అందాన్ని ఇస్తూ వుంటయి.ఇక అక్కడి మేము ప్రపంచ వింతలలో ఒకటైన EIFFEL టవర్ కి చేరుకున్నాము.ఎంతో అందమైన ఈ టవర్ ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి cranes కానీ machinary కానీ వుపయోగించకుండా కేవలుము nuts అండ్ bolts తో బిగించబడినది.ఇది కచ్చితంగా ఆశ్చర్య కరమైన విషయం.మొత్తం టవర్ మూడు floors గా విభజించారు.ఒక్కో floor లో నుంచుని చుస్తునప్పుడు nagram ఎంతో విభిన్నంగా కనపడుతుంది .టవర్ చివరి floor నుండి నగరం చూసినప్పుడు paris నగరమెంత పెద్దదో ,పక్కాన పారుతున్న siene నదిలో బోటు షికారు చేస్తున పర్యాటకుల కేరింతలు ,ఇంక చుట్టుపర్క్కల వున్నా పచ్చదనం ఎంతో బాగుంటుంది.EIFFEL టవర్ డిజైన్ చేయడంలోనే కాకుండా ప్రమదవశత్థూ టవర్ కూలిపోతే పోక్కన బిల్డింగ్స్ damage అవకుండా నాలుగు ప్రక్కల కూడా అ టవర్ పొడుగు వున్నంత మేర పచ్చిక ఎరుపాటు చేసారు.వారి ముందు చూపు ప్రసంసనియం .పచ్చిక చివర నుంచుని చూస్తుంటే ఈ టవర్ అందం అద్భుతం.

Friday, 22 May 2009

paris-1

నా మ్యారేజ్ తరవత నన్ను మావారు తీసుకుని వెళ్ళిన అందమైన ప్రదేశం paris.మే 2 2009 మేము paris బయలుదేరాము.ఒక అందమైన బస్ లో మా ప్రయాణం ప్రారంభం అయినది. మావారి వుద్యోగ రీత్యా మేము లండన్ లో వుంటాము.లండన్ చుసిన కూడా లండన్ దాటి country side వస్తుంటే తెల్సింది లండన్ లో ప్రకృతి ఎంత అద్భుతం గ వుందో.చుట్టపక్కల మైదానాలు లో గుర్రాలు,గొర్రెలు,పక్షులు స్వేచగా తిరగుతూ అహలదంగా వుండి nature.చదువుకున్నప్పుడూ ఇంగ్లీష్ nondetails లో చదువుకున్న చాల lessons గుర్తుకు వస్తాయి.lessons వినేటప్పుడు వుహించుకున్న meadows,moor లాంటి పదాలకు అర్ధం చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి.highway మీద bus వేగమగా వెళ్తుంటే ఎంతో అద్బుతం గ వుంటుంది చూడడానికి.లండన్ నుంచి paris వెళ్ళటానికి ఇంగ్లీష్ ఛానల్ అనే సముద్రం దాటాలి.ఈ సముద్రాన్ని దాటటానికి బ్రిటన్ సముద్రం కింద ఒక సొరంగం ఏర్పటు చేసి దానిలో ఒక eurostar అనే ట్రైన్ఏర్పాటు చేసింది. ఐతే మాది bus ప్రయాణం కావడం చేత ,ship లోbus ని లోడ్ chestharu .మనము సముద్రము మీద నుండి వెళ్ళాలి.మొదటిసారి నేను ship ఎక్కాను.నాకు shiplo ప్రయాణం చేసినప్పుడు flight ఎక్కినా కూడా కలగని అనుభూతి కలిగింది .ship టెర్రస్ మీద కి వెళ్తే సముద్రం మీద వీచే చల్లటి గాలికి శరీరం వణికిపోయింది.swetter లేకుండా terrace మీద కష్టం అనిపించింది.కానీ సముద్రాన్ని అంత దగ్గరగా చుస్తే చెప్పలేని ఒక థ్రిల్ల్ అనిపించినిది .ఇంత సముద్రము కింద నుండి రైలు మార్గం వేసిన ఇంజనీర్స్ మేధసుని తప్పక ప్రసంసించాలి.ఇంక ship లోపల resturants అతిదుల కోసం విభిన మైన ఫలహారాలతో చూడటానికి ఎంతో అందంగా వున్నాయి .మేము vegetarians అవడం తో మేము ఏమి taste cheyaledu.రుచి నాకు teliyadu.ఇంక అన్ని restuarntslo mostly non veg వుంటుంది. shiplo అందమైన వస్తువులు tax ఫ్రీగా sale చేస్తారు.మంచి షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం తర్వత మనం France లోని cali అనబడే సీపోర్ట్ కి చేరతాము.ఇక్కడ నుంచి ౩ గంటల ప్రయాణం తర్వాత మనము paris లో అడుగు పెడతాం.

Friday, 20 March 2009

NTR

నందమూరి తారక రామారావు నిన్న ,నేడు ,రేపు ఏనాటికీ మరువని మహా మనిషి.నాడు చిత్ర సీమని ఏలినా ,నిన్నరాజకీయం లో ప్రభాజనం సృష్టించినా ,నేటి రాజకీయానికి వుపిరిగా నిలచినవాడు. చిన్నపుడు చదివిన పాఠం గుర్తుకొస్తోంది. రాజు -కవి అనే పాఠం.అందులో కవి అంటాడు రాజు నిలుచును విగ్రహలలోన సుకవి నిలుచును ప్రజల హృదయాలలోన.కళాకారుడుగా అయన ప్రజల హృదయాలలో ఎంతగా గుర్తున్నరంటే నేటి రాజికియ నాయకులకు NTR పేరు చెప్పకుండా మనుగడ లేనీ పరిస్తితి.నందమూరి కుటుంబ సభ్యల ని చూస్తే మాత్రం పెరటి చెట్టు విద్యనికి పనికి రాదన్న సామెత లాగా,ఎవరికీ తండ్రి మీద ఏ మాత్రం అభిమానం వున్నటే లేదు.రక్త సంభందం లేని ఎక్కడివారో ఆయన్ను ఎంత గానో అభిమానిస్తారు.మరి రక్తం పంచుకుని పుట్టి ఆ మహానుభావుని పట్ల ఎవరికీ గౌరవేమే లేదనిపిస్తుంది.కానీ ఎవరికీ రామారావు పేరు తలచుకునే హక్కు లేదు.అది ఎ పార్టీ ఐన సరే ఆయన పేరును వాడుకుంటూ ప్రజలను మభ్య పెట్టటం అన్యాయం.గర్హనియైన సంగతతి.

Monday, 2 March 2009

చిరంజీవి...........చిన్న suggestion

నేను క్రితం సరి రాసిన పోస్ట్ లో చెప్ప్పను ఇక కుల విబేధాలు మొదలవతాయి అని.అది నిజమేననిఈనాటి మహిళా సంఘాలు నిరూపించాయి. మొత్తం మీద sobharani రోజా ని కామెంట్ చేసిన తీరు,రోజా శోభ రాణి కామెంట్ చేసిన తీరు వినటానికి ఎలా వున్నా, మర్చిపోదమనుకున్నా , మీడియా వారి చలువ వల్ల అది గోటి తో పోయేది గొడ్డలి దాకా వెళ్ళింది అనట్లు ఇవ్వాళా tv9 లో చర్చ కులాల విమర్శ కు దారి తీస్తోంది.చిరంజీవి తన్ను విమర్శించే వాళ్ళని ఎదుర్కోవాలి. మార్పు వురికే రాదు.కొత్త దారిలో వెళ్ళాలనుకుంటే ముళ్ళు రాళ్ళు వుంటాయి.దానిని బాగు చేసుకుంటూ ముందుకు నడవాలి అంతే కానీ తిరిగి అదే దారిలో నడుస్తూ వుంటే మార్పూ తనలో వస్తుంది కానీ సమాజం లో కాదేమో.కేవలం తన ఒక్కడే ప్రజారాజ్యం పాలసీ పాటిస్తే సరిపోదు.తన నేతలు కూడా పాటించేలా చూడాలి .అప్పుడే కదా లీడర్ అయ్యేది.అంతే కాదు తన పార్టీ లో నేతలను కూడా కులం ప్రాతిపదికన కాకుండా విజ్ఞానం ,అనుభవం వున్నవారిని నియమిస్తే బగుటుందేమో.ఎందుకంటే అన్ని పార్టీ లు చేసేదే అది కదా! ఏదో చేస్తారని అనుకుంటే మీరు అదే చేస్తున్నారు.బహుశా రాజకియలింతే ఏమో?మీ పార్టీ కూడా అన్ని పార్టీ లాగానే మారినట్టు వుంది.
కొంచెం వేనకు తిరిగి చూసుకోండి sir