Friday, 5 November 2010

దీపావళి శుభాకాంక్షలు


అందరికి దీపావళి శుభాకాంక్షలు

Monday, 1 November 2010

నాకు నచ్చిన పాట

చంటబ్బాయ్ లోని ఈ పాట వినడానికి ఎంత బాగుంటుందో చుస్తే అంతే నవ్వోస్తుంది.జంధ్యలగారికి హాస్యబ్రహ్మబిరుదు

సరిగ్గా సరిపోతుంది.

దశ-దిశ( HMTV)

HMTV లో నిర్వహిస్తున్న దశ దిశ కార్యక్రమం బాగుంటోంది . ఆదివారం జరిగిన తెలుగు భాష మీద చర్చ కార్యక్రమము ఎంతో బాగుంది. నాకు కూడా కొద్దిగా సాహిత్యం మీద ఇష్టం వుండటం తో ఈ చర్చ ఆసక్తిని పెంచింది.చర్చ చాల విషయాలమీద జరిగన ఒక విషయం నన్ను ఈ టపా రాయడానికి ఆలోచింపచేసింది. అది ఈ రోజుల్లో కావ్య బాష పనికి రానిది ఎవరికీ అర్థం కాదు కాబట్టి అది ఎందుకు అని అడిగారు కత్తి పద్మాకర్ గారు లాంటి వాళ్ళు చాలామంది . వాళ్ళతో పోలుచుకుంటే నాకు ఏమి తెలియదు .కనీసం నేను కాలేజీ లో తెలుగు subject గ కూడా తీసుకోలేదు.కాని ఒకటి ఎంతైనా కావ్య బాష లో వున్నా అందం అనేది చదివి ఆనందించే వాళ్ళకి మాత్రమే తెలుస్తూంది. ఇంటర్ లో మాకు సంస్కృతం secondlanguage.ఆ రకంగా ఒకటి రెండూ కాళిదాసు రాసిన పద్యాలూ వింటే ప్రకృతిని ఎంత అందంగా వర్ణించాడో ఆ మహా కవి అనిపిస్తుంది. ఉదాహారణకి కుమారసంభవం లో ఒకచోట ఇక్ష్వాక వంశీయుడైన దిలిప మహారాజు వసిష్ట మహర్షి ఆశ్రమంలో యాగానినికి వచ్చినప్పుడు అతను అడివిలో అలిసి పడుకున్నప్పుడు అతనికి చల్లటి గాలి వీచి ఆహ్లదపరుస్తుంది. అది ఎంత చక్కగా వర్ణిస్తాడంటే ఆ మహాకవి సువాసనులు కలిగిన పూలతో కూడిన చెట్ల కొమ్మల గాలి పక్కన వున్నా చల్లటి సెలయేటి తుంపరలతో కూడి అలసిన ఆ మహారాజుని సేవిస్తుంది అని అంటాడు. అది బాషలో వున్నా సౌందర్యం. అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం కలిగిస్తూంది. అలాగే జానపదం పాటలు వాటి అందం వాటివే. "బండెనక బండికట్టి పదారు బళ్ళూకట్టి" ,"ఎం పిల్లో వేల్దమోస్తావ" ఇవ్వన్ని మనం పడుకునేవే. వచనం,కవిత్వం,జానపదం అన్నిటికి దేని అందం దానికి వుంటుంది. అంతమాత్రాన కావ్య బాష ఎందుకు ?అర్థం కాని భాషలు పిల్లలకు అవసరం లేదంటే !చదివితెనేగా అర్థం అయ్యేది . అందులో అందం తెలిసేది. ఈ రోజుల్లోఎంతమంది సాహిత్యం మీద అభిలష వున్నవాళ్ళు వుంటున్నారు? ఎంత సెపూ టీవీ లో వచ్చే పిచ్చి కార్యక్రమాలతో పిల్లలలోని సృజన్మాతకత నశించి పోతుంది. పిల్లలు పుస్తకాలూ చదివినప్పుడు వాళ్ళలోని ఉహా శక్తీ పెరుగుతుంది. అందువల్ల తెలుగు బాషలో కావ్యం కానీ,గద్యం కానీ,జానపదం కాని ఎంతో చక్కనివి.వాటి ఆవశ్యకతతెలిపే విధంగా కృషి జరిగితే బాగుండు.