చాల రోజులకు మళ్లీ టపా రాస్తున్న. ఈసారి ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి.అది ఎవరంటే మా చిన్నారి సాయి వెంకట లక్ష్మి స్కంద యశస్వీ .మా చిన్ని తండ్రి వచ్చాక నిమిషం కాలి ఉండట్లేదు. వాళ్ళ తాతయ్యకైతె ఆయనే లోకం. పిన్ని కాలేజీ నించి వచ్చి పల్కరించాగానే వుయ్యలోంచి నువ్వుతూ సమాధానం చెప్తాడు.వాళ్ళ నాన్న పేరు చెప్తే చాలు ఆ వూ లు మొదలుపెడతాడు.వాడికి నేను అమ్మ ని తెలిసినట్టు వుంది మా నాన్న కానీ అమ్మకాని పేరుపెట్టి పిలిస్తే వెంటనే చుట్టూపక్కలకి చూస్తాడు నేను వచ్చానా లేదా అని.ఇంట్లో లైట్లంటే మహా ఇష్టం మా చిన్ని తండ్రికి.ఎప్పుడు ఆశ్చర్యంగా వాటి వంకే చూస్తుంటాడు.స్నానం చేసాక మహా ఉత్సాహంగా వుంటాడు.వాడు మొదటిసారి బోర్లపడ్డప్పుడు
కలిగిన ఆనందం వర్ణించలేనిది. మా చిన్ని కృష్ణుడి చిలిపి నవ్వు చుడాలిసిందే కానీ ఎంత బావుంటుందో చెప్పలేను. మా చిన్ని తండ్రి చిన్ని అల్లర్లతో మా ఇంట్లో నవ్వ్లు పూస్తున్నయి.
Wednesday, 14 July 2010
Subscribe to:
Posts (Atom)