Wednesday, 13 January 2010

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి అంటేనే మా ఇంట్లో బోలెడు సందడి. ఎన్నో జ్ఞాపకాలు. భోగి రోజు వేసే భోగి మంటలు, పండగకి అమ్మ చేసే అరిసెలు సంక్రాంతి కి మేము పెట్టె బొమ్మలు కొలువు.కనుమ రోజు తినే గారెలు ఎంత సందడి.పండగకి అమ్ముమ్మ ,తాతయ్య వాళ్ళింటికి వెళ్లి చుట్టలందరి మధ్యన జరపుకునే సంతోషం.ఒక్కసారి ఉక్కరిబిక్క్రి చేస్తునాయి. ఈ హడావిడిలో నాది ,మా చెల్లి పుట్టినరోజులు వరుసగా పక్క పక్కనే రావడం
చిత్రంగా 1 year తేడాతో ఇద్దరం 1 డే తేడాతో పుట్టాం.... పండుగాలలోనే పుట్టిన రోజుకూడా
గడచి పోవడం .. పండగకి సెలవులు యివ్వడం తో స్కూల్ freinds కి choclates యివ్వలేదని చిన్నfeeling .అన్ని జ్ఞాపకాలు గుర్తు వస్తుంటే పెళ్లి అయ్యి రెండో ఏడు పండగ కుడా
మేము ఇద్దరం మా ఇంటికి వేళ్ళలేకపోయం అనే బాధ . next year అయినా మా చిన్నారి తో భోగి మా వాళ్ళతో చేసుకోవాలి.

ఈ సంక్రాంతి అందరికి అన్ని శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ










సంక్రాంతి శుభాకాంక్షలు.