అబ్బ !మొత్తానికిమీద నేను చాలా రోజుల తరవాత బ్లాగ్ రాస్తున్న.ఇన్ని రోజులు ఎందుకు రాయలేదంటే నేను మావూరు విజయవాడ వెళ్లి వచ్చాను . బహుశా సంవత్సరన్నర తరవాత మా ఇంటికి వెళ్ళను. నా లైఫ్లొ ఇంతకాలం మా ఇంటి కి దూరంగా లేను.పెళ్లి అయ్యాక తప్పలేదు.దూరం అనేమాటే కానీ , ఎంత దురం లో వున్నా మా వాళ్ళని రోజు webcam లో చూడటం తో అంత బెంగ అనిపించలేదు.
ఇంకా నా ఇండియా విశేషాలలో ముఖ్యమైనది ఒకటి వుంది.ఈసారి అనుకోకుండా నేను శ్రీశైలం చూసాను.శ్రీశైలం చూడటం ఇదే మొదటిసారి. చాల ప్రశాంతంగా బాగుంది . ఇంకా టైం అసలు సరిపోలేదు .అంత హడావిడి ప్రయాణాలు.అటు మా అత్తగారింట్లొ వారం ,ఇక్కడో వారం అంతే మిగతా రోజులు ప్రయాణపు బడలికకి రెండురోజులు,మళ్ళి బయలుదేరడానికి కావలిసిన షాపింగ్ .అర్థమే కాలేదు ఎలా వెళ్ళానో ఎలా వచ్చానో. అంత హడావిడిగా జరిగింది.
ఇక్కడకు వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే మా అమ్ముమ్మ
expire అయ్యారని.నేను వున్నా నాలుగు రోజులుమా ఇంట్లోనే వుంది. ఇక్కడకు రాగానే ఈ news విన్న. సెటిల్ కావడానికి ఒక 1 వీక్ పట్టింది. తనకోసమే వెళ్లినట్టు వుంది . ఎంత బాగా చుస్కునేదో మమ్మల్ని. అందరిని పేరు పేరున ఫోన్ చేసి పలకరించేది.పండుగ ,పుట్టినరోజు ఏదైనా సరే తప్పకుండా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేది. ఆ ఆత్మీయత మర్చిపోలేనిది.నేను ఇంకా నమ్మలేకపోతుంది .ఇంకా మామయ్య వాళ్ళింట్లో వుంది అనే అనిపిస్తోంది. ఈ
year నాకు సంతోషం బాధ రెండూ యిచ్చింది .ఒకటి నేను conceive అవడం.రెండూ మా అమ్ముమ్మ పోవడం.
సంవత్సరం వెళ్ళిపోతోంది.కాలం ఎంత వేగంగా వుందో అనిపిస్తోంది.