Wednesday, 19 August 2009

పూలజడ

వేసవికాలం అంటే సెలవల్తో పాటు చాల విషయాలు గుర్తుకొస్తాయి .మామడిపళ్ళూ ,తాటిముంజలు,మల్లెపూలు.... మల్లెపూలు అంటేనే ప్రేత్యేకమైన అభిమానం . ముఖ్యంగా చిన్నప్పుడు సరదాపడి వేయించుకున్న పూలజడ.
ఇంటివాళ్ళకు ఆడపిల్లలు లేకపోవడంతో నన్నూ ,మాచెల్లినీ పిలిచి మరీ పులజడ వేసేవాళ్ళు.
ఇంటావిడని బామ్మగారు అనేవాళ్ళం . అప్పటికే ఆవిడకి 60 ఏళ్ళుకుడా ,ఆవిడ ఓపికగా కుర్చుని పూలజడ అల్లేది.ఇప్పుడంటే అందరు ఏ పెళ్ళికో ఫంక్షన్కొ షాపులో కొనుకొచ్చి అ గంట వేస్తున్నారు .బహుశా అప్పుడు కూడా పూలముర తీసి జడ చుట్టూ అల్లేసి పూలజడ అనిపిస్తున్నారు.కాని ఆవిడ చక్కగా ఒక విస్తారకుని తీసుకుని నిలువగా కట్ చేసి ఆ విస్తారుకి చక్కగా మల్లెపూలు,కనకాంబరాలు,మరువం కట్టి కుట్టేది.చిన్నపుడు మా జాడలు కూడా కొంచెం పెద్దవిగా వుండేవి.నాది ఇప్పుడు అంత పెద్దది కాదు కాని మా చెల్లిది యిప్పటికీ వాలు జడే. ఇద్దరం చక్కగా పూలజడ వేసుకుని లంగా జాకెట్ వేసుకుని ఫోటో దిగాలని కోరిక.మా నాన్నేమో ఆఫీసు నుంచి వచ్చీ మమ్మల్ని చూసి పల్లెటూరు వాళ్ళలాగ ఈ అవతారలేంటి అని చిరాకు పడేవారు .ఇంక బిక్కమోకలేసేవాళ్ళం. మా అమ్మప్పుడు ఏదో సర్ది చెప్పేది.ఇంక
ఫోటో కూడానా!
మొత్తం మీద అలా ఒకసారిఎప్పుడో ఫోటో కూడా తెయించుకుని ఆ కోరికా నేరెవేర్చుకున్నం .కాని అ ఫోటో యిప్పుడు మా అన్న్నయ వాళ్ళింట్లో అల్బుంలో పెట్టేయడం తో అది మాఇంట్లో లేకుండా పోయింది.ఎప్పటికైనా అది జాతీయం చేయాలనీ నా చిరకాల వాంఛ ఎందుకంటే అది మాములుగా అడిగితే ఇవ్వడం లేదు.ఆ తరవాత చాలా ఏళ్ళకి మొన్న నా పెళ్లి లో వేసుకున్న కానీ అ గంటా భరింఛటం చాల కష్టమైపాయింది .కానీ ఎంతైనా చిన్నపుడువున్నా సరదానే వేరు.



Tuesday, 18 August 2009

తలుచుకుంటే నోరూరుతుంది....



చిన్నపుడు ఎండా కాలం అంటే సెలవల్తో పాటు పచళ్ళు కూడా గుర్తుకొచ్చేవి.ఆవకాయ మాగాయ కంటే కొంచెముందుగనే ఉసిరికాయ,చింతకాయ,పండుమిరప దొరకడం తో వాటిని తొక్కు చేసి సంవత్సరం సరిపడా వుంచేది మా అమ్మ.
ఇప్పుడంటే నిల్వ పచ్చళ్ళు తింటే అరగడం
లేదని మానేసింది గాని.అసలు అవి కొనడానికి మార్కెట్ కి వెళ్ళడం తేవడం, తెచ్చినవి
కడిగి అరబెట్టటం చాల సరదాగా వుండేది .అన్నిట్లొన పండుమిర్పకాయ పచ్చడి తెగ నచ్చేది నాకు .ఎర్రటి పండుమిర్పకాయ పచ్చడి వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన వెన్నపూస వేసుకొని నోట్లో ఒక్కమొద్దా తిన్టూ వెన్నపూస నంచుకుంటే అబ్బో బ్ర్మహండం. అసలు ఇలా తినాలని కూడా మా నాన్నె చెప్పారు.తరవత్త దినీ మీద మనసుతో ఇది ఎలా చేయాల్లో నేర్చుకున్న .

ఈ పచ్చడి మిక్సీలో వేయడం వేస్ట్.చక్కగా రోట్లో చేస్తే అసలు taste బయటకు వస్తుంది.చక్కగా మెంతులు వేయించుకుని రోట్లో పౌడర్ చేసుకుని ,పండుమిరపకాయల తొక్కు ,కొద్దిగా చింతపండు, వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాక అంత నునే తో తాలింపు పెడితే చాల బాగుంటుంది.కానీ ఇది తిన్న తర్వాత బాగా పెరుగన్నం లేదా మజ్జిగ తినాలి లేకపోతే బాగా వేడి చేస్తుంది. తల్చుంటేనే నాకు నోరూరుతోంది,ఇవ్వాలో రేపో చేస్కుని తినాలి.అద్నమాట సంగతి.